గల్ఫ్ దేశాలకు( Gulf countries ), భారతీయులకు ఎక్కువ సంబంధాలు ఉంటాయి.కారణం ఇక్కడివారు అక్కడికి ఎక్కువగా వలస కార్మికులుగా వెళుతుండడమే.
ఈ దేశాలు పర్యాటకానికి కూడా ప్రసిద్ధి చెందినవి కాబట్టి, గల్ఫ్ గురించి మాట్లాడేవారు ఎక్కువగా విజిట్ వీసా ( Visit visa )గురించి లేదా వర్క్ వీసా( Work visa ) గురించి మాట్లాడుతుంటారు.ఈ క్రమంలో కొందరు ఏజెంట్లు అడ్డదారిలో డబ్బు సంపాదించాలని, అభంశుభం తెలియని కార్మికులను మోసం చేస్తుంటారు.
విజిట్ వీసా మీద అక్కడకు పంపి తర్వాత వారికి అందుబాటులో లేకుండా పోతారు.

ఇక వీసా గడువు తీరిన తర్వాత అక్కడ మనవాళ్ళు అనధికారికంగా ఉండి దినదిన గండంగా బతుకుతూ వుంటారు.ఇలా అనధికారికంగా ఆ దేశంలో ఉండే వాళ్ల సంఖ్య తగ్గించుకోవాలని యూఏఈ విజిట్ వీసా నిబంధనలు తాజాగా కఠినతరం చేసేసింది.సాధారణంగా యూఏఈ 30 రోజులు, 60 రోజుల గడువుతో విజిట్ వీసాలను జారీ చేస్తూ ఉంటుంది.
ఈ వీసా గడువు ముగిసేలోగా మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చేయాలి.లేకపోతే పెద్దమొత్తంలో జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడొచ్చు.

ఇక విజిట్ వీసా మీద వెళ్లినప్పటికీ కొందరు అక్కడ పని చేయడానికే స్థిరపడతారు.ఇలాంటివారు ఈ విషయం తెలుసుకోవాలి.వీసా గడువు తీరినా అక్కడే ఉంటే వారిని నిషేధిత జాబితాలో చేరుస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.ఈ నిషేధం పడితే.వారు ఇతర గల్ఫ్ దేశాల్లో ప్రవేశానికి కూడా అనర్హులవుతారు.అందుకే యూఏఈలో పని చూపిస్తామని, విజిట్ వీసాపై వచ్చినా.
ఆ తర్వాత దాన్ని వర్క్ వీసాగా మారుస్తామని ఏజెంట్లు మాయమాటలు చెబితే నిరుద్యోగులు ససేమిరా నమ్మరాదని గల్ఫ్ వలస కార్మిక సంఘాల ప్రతినిధులు జాగ్రత్తలు చెబుతున్నారు.ఒక్కసారి నిషేధం గాని పడితే గల్ఫ్ ఆశలు వదిలిపెట్టుకోవాల్సిందే.







