సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లు కాస్త చనువుగా కనిపించారు అంటే చాలు వారి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలను సృష్టిస్తూ వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఉంటారు.కొంతమంది అయితే సెలబ్రిటీల జంటలు కాస్త బాధ కలిగించే విధంగా ఏవైనా కొటేషన్స్ పెడితే వెంటనే సదరు సెలబ్రిటీ జంట విడిపోతున్నారు.
విడాకులు తీసుకోబోతున్నారు.గొడవలు జరుగుతున్నాయి అంటూ ఇలా ఏవేవో వార్తలను సృష్టిస్తూ ఉంటారు.
కొందరు సెలబ్రిటీలు( Celebrities ) అటువంటి వార్తలను చూసి చూడనట్టు వదిలేయగా మరికొందరు వాటిపై వివరణ ఇస్తూ ఉంటారు.కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోని వ్యక్తులు బయట వ్యక్తులతో కాస్త చనువుగా కనిపించినా కూడా ఇలాగే వార్తలు సృష్టిస్తూ ఉంటారు.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కి సంబంధించిన అలాంటి వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ ( Bollywood )నటి పరిణీతి చోప్రా.కాగా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా( Parineeti Chopra ), ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్‌లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఆ వార్తలను నిజం అనిపించేలా ఈ జంట కూడా ఇప్పటికే చాలాసార్లు కలిసి కనిపించడంతో అభిమానులు కూడా నిజమే అని వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకున్నారు.
ఈ జంట చాలాసార్లు ముంబయి, ఢిల్లీ( Mumbai, Delhi ) విమానాశ్రయాల్లో కెమెరాలకు చిక్కింది.దాంతో ఈ జంటపై వస్తున్న డేటింగ్ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చిన్నట్టు అయింది.
అయితే వీరిద్దరి రిలేషన్ షిప్ పై ఆప్ ఎంపీ సంజీవ్ ఆరోరా ( MP Sanjeev Arora )విషెస్ కూడా తెలిపారు.

త్వరలోనే ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.వార్తలు జోరుగా వినిపిస్తున్నప్పటికీ ఈ జంట నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రావడం లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్‌లో పరిణీతి చోప్రా కనిపించింది.
ఆ వీడియోలో పరిణీతి చోప్రా చేతికి ఉంగరం కనిపించింది.దాంతో ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నట్లు బాలీవుడ్ సినీ కలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
తాజాగా పరిణీతి చోప్రా వేలికి ఉంగరం కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేశారు.మరి ఈ విషయం గురించి ఈ జంట ఎప్పుడూ అధికారికంగా స్పందిస్తారో చూడాలి మరి.







