ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా దగ్గర ప్రకటించిన కొత్త సినిమాల్లో భారీ హైప్ ను క్రియేట్ చేసి టోటల్ గా ఇండియాను షేక్ చేసిన సెన్సేషనల్ కాంబో అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Jr NTR ) అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ( Hrithik Roshan ) అనే చెప్పాలి.ఊహించని ఈ కాంబో ప్రకటించడమే సెన్సేషనల్ అయ్యింది.
ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
మరి వార్ 2 ( War 2 ) సినిమా అయితే ప్రకటించారు కానీ ఎప్పుడు.
ఎలా.ఎక్కడ.స్టార్ట్ అవుతుందో మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇంకా చెప్పలేదు.అసలు సౌత్ స్టార్ అయిన ఎన్టీఆర్ ను నార్త్ స్టార్ అయిన హృతిక్ ను కలిపి ఎలాంటి కథను డైరెక్ట్ చేస్తారా అది ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
మరి ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి తాజాగా ఎన్టీఆర్ రోల్( NTR role ) పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.

ఈ సినిమా కథ ఇద్దరి స్నేహితుల మధ్య సాగుతుందట.అర్జునుడు – కృష్ణుడు లా కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు చివరకు శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అనే కోణంలో సినిమా సాగుతుందని.ఎన్టీఆర్ పాత్ర కృష్ణుడు పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు.
ఏది ఏమైనా హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ వైటింగ్ చేస్తున్నారు.

ఇక వార్ 2 సినిమాను ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించారు.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ను యష్ రాజ్ ఫిలిమ్స్ పై ఆదిత్య చోప్రా నిర్మించ బోతున్నారు.ఈ సినిమాతో ఎన్టీఆర్ కు మాత్రమే కాదు హృతిక్ రోషన్ కు కూడా లాభమే.
ఎన్టీఆర్ కు ఇప్పటికే హిందీలో మార్కెట్ ఉంది.ఇక ఈ సినిమాతో మరింత పెరుగుతుంది.
అలాగే హృతిక్ కు నార్త్ మార్కెట్ పెంచుకునే అవకాశం ఈ సినిమాతో లభించింది.చూడాలి ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉండబోతుందో.







