ఏపీలో 2019 ఎన్నికల ముందు కోడికత్తి వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు.వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో అదికూడా వీఐపీ లాంచ్ లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కు కోడికత్తి పోటు( Ys Jagan ) తగలడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

అంతటి సెక్యూరిటీ మద్య ఒక చిన్న కోడి కత్తితో ఎవరో ఒక అనామకుడు ఎందుకు దాడి చేశాడనే అప్పటి నుంచి ఇప్పటికీ కూడా తరచూ చర్చల్లో నిలుస్తూనే ఉంది.అయితే అయితే కోడికత్తి వ్యవహారం వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) ఉన్నాడని జగన్ పై హత్యయత్నం చేసేందుకే ఈ దాడి చేశారంటూ వైసీపీ( YCP ) నేతలు పెద్దఎత్తున ప్రచారం చేశారు.

అయితే కోడికత్తుల తో దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని, అదంతా జగన్ ప్రణాళిక ప్రకారమే జరిగిందని టిడిపి నేతల నుంచి వినిపిస్తున్న మాట.అయితే ఆ తరువాత కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్ కావడం, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారంలోకి రావడం అన్నీ చక చక జరిగిపోయాయి.అయితే కోడికత్తి దాడి జగన్ డైరెక్షన్ లోనే సానుభూతి కోసం జరిగిందనే విమర్శ మొదటి నుంచి కూడా వినిపిస్తోంది.కాగా ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఈ కేసుకు సంబంధించి 2019 లో ఎన్ఐఏ ( NIA ) కు నిందితుడు శ్రీనివాస్ ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది.

కేవలం జగన్ గెలుపు కోసమే దాడి చేసినట్లు శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.దాడికి ముందు 160 సీట్లు గెలుస్తారని, పొడిచే ముందు కత్తికి స్టెరిలైజ్ చేశానని, మీకేమి కాదని జగన్ కు శ్రీనివాస్ చెప్పినట్లు అప్పటి వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది.దీన్ని బట్టి చూస్తే కోడికత్తి వ్యవహారం పక్క ఎన్నికల వ్యూహామని, దానికి కర్త కర్మ అన్నీ జగనే అనే వాదనలు వినిపిస్తున్నాయి.అయితే ఈ కోడికత్తి వ్యవహారం 2024 ఎన్నికల్లో జగన్ ను చిక్కుల్లోకి నెట్టే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.
ఎందుకంటే జగన్ గెలుపుకోసం కోడికత్తి డ్రామా ఆడారనే భావనా ప్రజల్లో స్థిరపడిపోయే అవకాశం ఉంది.ఇది వైసీపీ ఓటు బ్యాంక్ పైన తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
మొత్తానికి 2019 ఎన్నికల సమయంలో గుచ్చుకున్న కోడికత్తి రివర్స్ అటాక్ లో 2024 లో జగన్ కు ఓట్ల ద్వారా గుచ్చుకునే అవకాశం ఉందని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా మాట.







