విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు బిడ్ గడువు ముగిసింది.కర్మాగారంలో ఉక్కు, ముడి ఉక్కు తయారీపై పలు సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ ఆర్ఐఎన్ఎల్ గత మార్చి 27వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ్టితో బిడ్ వేసేందుకు గడువు ముగిసింది.ఈ క్రమంలోనే బిడ్ వేసే వారికి ఆర్ఐఎన్ఎల్ కొన్ని నిబంధనలు పెట్టింది.
కోకింగ్ కోల్, బ్లాస్ట్ ఫర్నేస్ కోక్, ఇనుప ఖనిజం సరఫరా చేసే సంస్థలకే బిడ్ వేసే అవకాశాన్ని కల్పించింది.ఈవోఐ నిబంధనల ప్రకారం స్టీల్ ప్లాంట్ కు బిడ్ ను ఏ దశలో అయిన తిరస్కరించే హక్కు ఉంటుంది.







