రాజమౌళి చెల్లెలు శ్రీలేఖ( Srilekha ) గురించి మ్యూజిక్ లవర్స్ కు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.చిన్న సినిమాలకు సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా శ్రీలేఖ పాపులర్ అయ్యారు.
తక్కువ రెమ్యునరేషన్ తో క్వాలిటీ మ్యూజిక్ కావాలని కోరుకునే దర్శకనిర్మాతలు శ్రీలేఖకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు.రాజమౌళి చెల్లెలు( Rajamouli Sister ) అయినప్పటికీ శ్రీలేఖ తనకంటూ సొంతంగా గుర్తింపును సొంతం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.
అయితే తన సంపాదన గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి శ్రీలేఖ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.రాజన్న సినిమాకు( Rajanna Movie ) కీరవాణి కావాలని నాగార్జున కోరడంతో ఆ మూవీ ఛాన్స్ రాలేదని ఆమె తెలిపారు.కొంతమంది దర్శకనిర్మాతలతో మంచి బాండింగ్ ఉందని శ్రీలేఖ పేర్కొన్నారు.2000 రూపాయలు, 3000 రూపాయలకు పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

డివోషనల్ సాంగ్స్ విషయంలో పారితోషికం పట్టించుకోనని శ్రీలేఖ పేర్కొన్నారు.భాస్కరభట్ల గారి నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుందని అందుకే ఆయనకు పాటలు రాయడానికి ఎక్కువగా అవకాశాలు ఇస్తానని ఆమె వెల్లడించారు.కెరీర్ తొలినాళ్లలో సినిమాల ఎంపికలో తప్పులు జరిగాయని శ్రీలేఖ చెప్పుకొచ్చారు.ఆర్థికంగా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆమె కామెంట్లు చేశారు.

ఒకప్పుడు నేను పాడిన క్రిస్టియన్ పాటలు అన్నీ హిట్ అయ్యాయని శ్రీలేఖ తెలిపారు.అలా నేను 4000 పాటలు పాడానని శ్రీలేఖ చెప్పుకొచ్చారు.పాటలు పాడినంత మాత్రాన మతం మారిపోయానని అనుకోవద్దని ఆమె కామెంట్లు చేశారు.సంగీతానికి కులమత బేధాలు లేవని లేవని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.నేను వర్క్ ను మాత్రమే చూస్తానని ఆ వర్క్ చిన్నదా పెద్దదా అని నేను పట్టించుకోనని శ్రీలేఖ తెలిపారు.శ్రీలేఖ టాలెంట్ కు తగిన గుర్తింపు దక్కలేదని చాలామంది భావిస్తారు.







