తెలుగు సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్( Ram Charan, Jr.NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా మారిన విషయం తెలిసిందే.ఈ ఇద్దరు హీరోలు తదుపరి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లా స్నేహబంధం గురించి మనందరికీ తెలిసిందే.ఆర్ఆర్ఆర్ వారిద్దరి మధ్య స్నేహం ఎంత ఉంది అనేది కళ్లకు కట్టినట్టు చూపించారు.
ఇది ఇలా ఉంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు గాను అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు అదే ఆస్కార్ అవార్డు( Oscar Award ) ఆ ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు ఆధారాలు కూడా ఇవే అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇటీవల కాలంలో తారక్, చెర్రీ మధ్య వచ్చిన దూరం చూస్తుంటే అవి నిజమనక మానదు.
ఆ వివరాల్లోకి వెళితే… ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ చెర్రీ అభిమానుల మధ్య అసలైన వార్ మొదలైంది.అంతేకాకుండా ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ఆమధ్య ఒకసారి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా అందులో రామ్ చరణ్ పేరు ప్రస్తావించలేదు.తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) నటించిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ వేడుకలో సినిమాలో పనిచేసిన అందరి పేర్లు చెప్పిన తారక్ రామ్ చరణ్ పేరు మర్చిపోయాడు.

అంతేకాకుండా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అందరూ హీరోలు హాజరు కాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు.అయితే వీరిద్దరి మధ్య గ్యాప్ ఉంది అనడానికి అవన్నీ నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.ఇద్దరు హీరోలు గ్లోబల్ స్టార్ అన్న గుర్తింపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారని ఇద్దరి మధ్య గొడవలు కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ఇద్దరూ ఒకే పి ఆర్ ని కలిగి ఉన్నారు కానీ ఈ సినిమా తర్వాత ఇద్దరు ఎవరికి వారు పిఆర్ ని మెయింటైన్ చేస్తున్నారు.
తాజాగా తారక్ ఇంట్లో పార్టీకి కేవలం దర్శక నిర్మాతలకు మాత్రమే పార్టీ ఇవ్వగా ఆ పార్టీకి రాంచరణ్ రాకపోవడంతో ఆ ఊహగానాలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.







