1.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి సర్వదర్శనానికి నేడు రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
2.మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠ్యాంశం తొలగింపు
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 11వ తరగతి పాఠ్య పుస్తకం నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠ్యాంశాన్ని తొలగించారు.
3.కాంగ్రెస్ కు మహేశ్వర్ రెడ్డి రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు.
4.జగన్ పై కన్నా విమర్శలు
జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అని టిడిపి నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
5.ఢిల్లీ పర్యటనలో బండి సంజయ్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.పార్టీకి చెందిన అగ్ర నేతలను కలిసే పనిలో ఉన్నారు.
6.కోడి కత్తి కేసు 17 కు వాయిదా
వైసీపీ అధినేత , ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కు సంబంధించిన కోడి కత్తి కేసును ఈ నెల 17 కు వాయిదా వేస్తూ ఏపీ హై కోర్టు తీర్పు ఇచ్చింది.
7.నారా లోకేష్ బహిరంగ లేఖ
టిడిపి యువనేత నారా లోకేష్ యువ గళం పాదయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా సాగింది.ఈ సందర్భంగా లోకేష్ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ బహిరంగ లేఖ రాశారు.
8.బిజెపియేతర ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ
బిజెపియేతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు.
9.బీజేపీ లో చేరిన మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతగా గుర్తింపు పొందిన మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బిజెపిలో చేరారు.
10.ధనిక సీఎంల జాబితాలో జగన్
భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి గా మొదటి స్థానంలో వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ ఉన్నారు.
11.చంద్రబాబుకు పేర్ని నాని సవాల్
టిడిపి అధినేత చంద్రబాబుకు మాజీమంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేరు నాని సవాల్ విసిరారు దమ్ముంటే 2014 నుంచి 19 వరకు తాను చేసిన పాలనను తిరిగి తీసుకొస్తానని చెప్పాలని, జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తానని చెప్పగలవా అని నాని సవాల్ చేశారు.
12. కేఏ పాల్ కామెంట్స్
సింగరేణిని కొనలేని వారు విశాఖను కొంటారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.
13.కేటీఆర్ పై కిషన్ రెడ్డి సెటైర్లు
తెలంగాణ ఎందులో ముందు ఉందో అందరికీ తెలుసునని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు.
14.రాహుల్ గాంధీ పై మరో పరువు నష్టం కేసు నమోదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై మరో పరువు నష్టం కేసు నమోదయింది.
15.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10, 158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.రాష్ట్ర పండుగగా తిరుపతి గంగమ్మ జాతర
తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్రీయ పండుగగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది.
17.రాహుల్ గాంధీ కేసు విచారణ
ఈరోజు సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ కేసు విచారణ జరిగింది.
18. నామినేషన్ల స్వీకరణ
నేటి నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది.
19.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులు ఏడీ దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది.
20. నేడు ఢిల్లీకి తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళ సై నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు.