రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ హైదరాబాద్ లో ఏప్రిల్ 14న వైభవోపేతంగా జరుగనున్న దృష్ట్యా ఈ వేడుకకు జిల్లా నుంచి ప్రజలను తరలించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు.మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో డాక్టర్ బి.
ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కు ప్రజలు పాల్గొనేందుకు చేయాల్సిన ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యెలా చర్యలు తీసుకోవాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 బస్సులతో ప్రజలను తరలించాలని, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ మండల కేంద్రం నుంచి బస్సులు నడపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు.అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకార్యక్రమానికి తప్పనిసరిగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైదరాబాద్ కు ప్రజలు చేరుకునే విధంగా జిల్లా స్థాయిలో ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్ , ఎస్సీ అభివృద్ది అధికారి మోహన్
.