కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ..!!

మే 10వ తారీకు కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు( Karnataka Assembly Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.254 స్థానాలకు జరిగే ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలు గెలుపు కోసం రకరకాల వ్యూహాలతో దూసుకుపోతూ ఉన్నాయి.బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నాయి.మే 10న ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు.ఇదిలా ఉంటే కర్ణాటక( Karnataka ) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా బీజేపీ ( BJP ) విడుదల చేయడం జరిగింది.మొదటి జాబితాలో 189 మందికి చోటు కల్పించగా ఇందులో 52 మంది కొత్తవారు ఉన్నారు.

 Bjp Has Released The First List Of Candidates To Contest In The Karnataka Assemb-TeluguStop.com

కర్ణాటకలో పార్టీ బలపడటానికి రాష్ట్రము అభివృద్ధి చెందటానికి కొత్త నాయకత్వం అవసరం ఉందని అరిష్టానం ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.ఇదిలా ఉంటే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై షిగ్గాన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ పెద్దలు చాలా సీరియస్ గా తీసుకున్నారు.ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ… దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే రాణిస్తూ ఉంది.దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించే దిశగా బీజేపీ సీనియర్ నాయకులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube