తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన శ్రీయ( Shirya ) ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన మెప్పించారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగ్రతారక ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్న శ్రియ వ్యక్తిగత జీవితంలో కూడా అంతే ఆనందంగా ఉన్నారు.ఈమె ఆండ్రు( Andrew ) అనే విదేశీ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈమె తన ప్రేమ పెళ్లి విషయాన్ని చాలా రహస్యంగా ఉంచి పెళ్లి తర్వాత తన ఫోటోలను రివిల్ చేశారు.

ఇలా శ్రియ విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుందనే విషయం తెలియడంతో అభిమానులు ఒకింత నిరుత్సాహానికి కూడా గురయ్యారు.అయితే ఈ విషయం పక్కన పెడితే ఈమె తనకు కూతురు పుట్టిన విషయాన్ని కూడా చాలా రహస్యంగా ఉంచారు.కూతురుకు దాదాపు పది నెలల వయసు వచ్చేవరకు ఈమె ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేయలేదు.
ఇలా కూతురు పుట్టిన తర్వాత తన కూతురు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా శ్రీయ ఇలా తన ప్రెగ్నెన్సీ ( Pregnancy ) విషయాన్ని రహస్యంగా దాచిపెట్టడానికి కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ సందేహాలు వ్యక్తం చేశారు.

ఇలా ఈ ప్రశ్నకు శ్రియ సమాధానం చెబుతూ తాను కరోనా సమయంలో ప్రెగ్నెంట్ అయ్యానని అయితే ఆ సమయంలో తాను ప్రెగ్నెన్సీ గురించి దాచడానికి కారణం ఉందని తెలిపారు.సాధారణంగా ప్రెగ్నెంట్ అయిన మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటకు చెబితే తన పై బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తారన్న భయంతోనే తాను బయట పెట్టలేదని తెలిపారు.ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి మానసిక ఒత్తిడికి తాను

గురికాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకున్నానని అందుకే తాను ఈ విషయాన్ని దాచి పెట్టాను అంటూ అప్పట్లో ఈమె వివరణ ఇచ్చుకున్నారు.అయితే తాజాగా శ్రీయ తన బేబీ బంప్( Baby Bump ) ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇలా ఒకప్పుడు తన బేబీ బంప్ రహస్యంగా ఉంచిన ఈమె ప్రస్తుతం ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







