అదేంటి నదిపైన పల్సర్ బండితో( Pulsar bike ) డ్రైవ్ చేసుకుంటూ వెల్లడమేమిటి? అతడికి ఏం కాలేదా? అనే అనుమానం వస్తోంది కదూ.సాధారణంగా రోడ్డు మీద కొద్దిపాటి నీళ్లున్నా, కాస్త ఇసుక ఉన్నా బైక్ నడపడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
చాలా బాలన్స్ చేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.అలాంటిది ఓ యువకుడు ఏకంగా తన బైక్‌తో నదినే దాటేసాడు.
పోనీ అదేమైనా నీటిలోనూ, రోడ్డుపైనా నడిచే టూ ఇన్ వన్ బైకా( Two in one bike ) అంటే అదీ కాదు.అది ఓ సాధారణ పల్సర్ బైక్.
నదిలో నీరు తక్కువగా ఉండటంతో యువకుడు ఈ సాహసం చేసినట్టు అర్ధం అవుతోంది.కానీ వైరల్ అవుతున్న వీడియోని చూసి జనాలు అవాక్కవుతున్నారు.
అవును, రెండు అడుగుల నీరు కలిగిన ఆ నదిలో అతను ఎంతో చాకచక్యంతో బైక్ పైన నదికి ఈ వైపు నుంచి అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడు.ఈ వీడియో నెట్టిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఓ యూట్యూబ్ చానల్ ఈ వీడియోని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేయగా వెలుగు చూసింది.సంకల్పం బలంగా ఉంటే మార్గం సుగమం అవుతుంది అనే క్యాప్సన్ తో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది.
కాగా ఈ వీడియోను ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా వీక్షించారు.అంతేకాకుండా వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
వీడియోని ఒకసారి పరిశీలిస్తే నది ఇవతలి నుండి అవతలివైపు వరకు అతగాడు సునాయాసంగా పల్సర్ బైక్ తో దాటేయడం స్పష్టంగా కనబడుతోంది.చాలా రిస్క్ చేసావు బ్రో అని చాలామంది కెమెంట్ చేయగా కొంతమంది రిస్క్ ను అంచనా వేస్తూ తెలివిగా డ్రైవ్ చేశాడంటూ మెచ్చుకుంటున్నారు.మరెందు కాలస్యం, మీరు కూడా ఆ వీడియోని చూసి మీమీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.