ప్రస్తుత కాలంలో సినిమాలకు భాషతో సంబంధం లేకుండా పోయింది.ఒక భాషలో తెరకెక్కిన సినిమాలు ఇతర భాషలలో కూడా విడుదల అవ్వడమే కాకుండా ఇతర భాష హీరోలు మరొక భాష చిత్రాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్( Salman Khan ) తాజాగా నటిస్తున్నటువంటి చిత్రం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ( Kisi Ka Bhai Kisi Ka Khan ).ఈ సినిమాలో నటి పూజా హెగ్డే ( Pooja Hedge )హీరోయిన్ గా నటించగా టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్( Venkatesh ) కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో ఓ పాటలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ramcharan )కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి ఏంటమ్మా( Yentammaa ) అనే సాంగ్ విడుదల చేశారు.ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.ఈ పాటలో సల్మాన్ ఖాన్ వెంకటేష్ రామ్ చరణ్ ముగ్గురు లుంగీకటి అద్భుతమైన మాస్ పర్ఫామెన్స్ చేశారు.
ఇక ఈ పాట విడుదలైన 48 గంటలలోనే అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో ఏకంగా 43 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డులు సృష్టిస్తుంది.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది.
ఇకపోతే మేకర్స్ ఈ సాంగ్ బిటిఎస్ వీడియోని విడుదల చేశారు.

ఇందులో రామ్ చరణ్ మాట్లాడుతూ ఏంటమ్మా సాంగ్ చేసేటప్పుడు తాను తెగ ఎంజాయ్ చేశానని తెలిపారు.అందరం కలిసి ఈ పాటకు డాన్స్ అదరగొట్టేసామని తెలిపారు.ఇలా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి తాను ఈ పాటలో నటించడం కళ నిజమైనట్టుగా ఉందని తెలిపారు.
ఈ పాటలు తాను కూడా భాగం కావడం మర్చిపోలేని అనుభూతి అని రాంచరణ్ తెలిపారు.ఇక ఈ పాటను వెండితెరపై చూసినప్పుడు మరింత కిక్ ఇస్తుందని ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక రామ్ చరణ్ కూడా ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.







