హన్మకొండ కోర్టు దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.మరికాసేపటిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు న్యాయస్థానం వద్దకు భారీగా చేరుకున్నారు.పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకుంటున్నారు నేతలు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ కోర్టు దగ్గర ఆందోళన కార్యక్రమం చేపట్టారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది.
టెన్షన్ వాతావరణం నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.కాగా కుట్ర కేసులో భాగంగా బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.







