బాలీవుడ్ నటి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో స్థిరపడి అక్కడే పలు హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా హాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైనటువంటి ఈమె బాలీవుడ్(Bolly wood) ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉంటున్నారని చెప్పాలి.
అయితే గతంలో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ రాజకీయాలు(Cine Politics) ఎక్కువగా ఉన్నాయని తనకు అవకాశాలు కూడా రాకుండా చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విధంగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నేటిజన్స్ ఈ విషయంపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఇన్ని రోజులు బాలీవుడ్ గురించి మౌనంగా ఉన్నటువంటి ఈమె ఇలా ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీపై ఇలాంటి కామెంట్స్ చేయడానికి గల కారణమేంటి అంటూ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన ప్రియాంక చోప్రా మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ పాడ్‌కాస్ట్‌లో వాళ్లు నా సినీ ప్రయాణం గురించి అడిగినప్పుడు తాను చిన్నప్పటినుంచి ఇప్పటివరకు నా జీవితంలో జరిగిన అన్ని విషయాల గురించి నిజాలనే చెప్పానని తెలిపారు.

ఇక నా జీవితంలో ఎదురైనటువంటి ఇబ్బందుల (బాలీవుడ్ సినీ రాజకీయాలను) గురించి చెప్పడానికి తనకు ఇప్పటికి ధైర్యం వచ్చిందని తెలిపారు.నాకు అనిపించిన విషయాన్ని ధైర్యంగా చెప్పే స్థాయికి తాను వచ్చానని ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా వెల్లడించారు.అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు ఎదురైనటువంటి గందరగోళ పరిస్థితులను చూశాను అయితే వాటన్నింటినీ తాను ఎప్పుడో క్షమించి ఎప్పుడో ముందడుగు వేశానని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.
ఈ విధంగా తాను ముందడుగు వేసి నా ప్రశాంతతను నేను చూసుకున్నానని,అందుకే అప్పటి పరిస్థితులను తాను అందరితో పంచుకోగలిగాను అంటూ ఈ సందర్భంగా బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మరోసారి ప్రియాంక చోప్రా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







