జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ను బ్లాక్ మెయిల్ చేసేందుకే లోకేష్( Lokesh ) యువ గళం పాదయాత్ర చేపడుతున్నారంటూ గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ) విమర్శలు చేశారు.2019లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ ఆ తర్వాత ఆ పార్టీకి రెబల్ గా మారి ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.ప్రతి సందర్భంలోనూ లోకేష్, చంద్రబాబుపై పంచ్ డైలాగులు వేస్తూ వంశీ సెటైర్లు వేస్తూ ఉంటారు.గతంలో ఆయన వేసిన సెటైర్లు తీవ్ర దమ్మారాన్ని రేపడంతో పాటు , టిడిపి అధినేత చంద్రబాబు తాను అసెంబ్లీ లోకి అడుగుపెట్టేదే లేదు అంటూ శబదం కూడా చేశారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం లోకేష్ చేపడుతున్న యువ గళం పాదయాత్ర పై తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ స్పందించారు.

లోకేష్ చేపడుతున్న పాదయాత్ర వల్ల ఒరిగేదేమీ లేదని, లోకేష్ యాత్ర అనేది ఏదో ఒక రికార్డు ప్రయోజనం కోసం తప్పితే , ఆ యాత్ర వల్ల ఒక్క ఓటు కూడా టీడీపీ కి పెరగదని వంశీ అన్నారు.లోకేష్ అనేవాడు కోటలో ఉన్నా.పేటలో ఉన్నా ఒకటే.
లోకేష్ యాత్ర వల్ల ఒక్క ఓటు కూడా పెరగదు .చంద్రబాబుకు పడని ఓటు లోకేష్ కు ఎలా పడుతుంది.జూనియర్ ఎన్టీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు లోకేష్ యాత్ర చేపడుతున్నారని, లోకేష్ యాత్ర కారణంగా కార్యకర్తలంతా ఆర్థికంగా చితికి పోతున్నారు అంటూ వంశీ విమర్శించారు.కార్యకర్తల సొమ్మంతా లోకేష్ పప్పుకి, టిఫిన్లకే సరిపోతుంది అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

మేమేదో గోడ దూకుతామని కొందరు మెరుపు కలలు కంటున్నారు.అవి మెరుపు కలలు మాత్రమే.అటువంటి పరిస్థితి లేదు అంటూ వంశీ అన్నారు.నిన్న జరిగిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల సమావేశానికి వంశీ హాజరు కాకపోవడం పై వైసిపి ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల పైన వంశీ స్పందించారు.
నేను ఐఎస్ బీ లో పరీక్ష రాస్తున్నందున ఎమ్మెల్యేల మీటింగ్ కు వెళ్లలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబు నంబర్ వన్.టిడిపి ఒక ఎమ్మెల్సీ గెలవడం వల్ల వైఎస్సార్ సీపీ కి వచ్చిన నష్టం ఏమీ లేదు అంటూ వంశీ అన్నారు.