చరణ్ నాకు ఉప్మా చేసి పెట్టాడన్న ప్రముఖ నటి.. ఉంగరాలు ఇచ్చానంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram Charan ) కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా రామ్ చరణ్ ను సెలబ్రిటీలలో కూడా చాలామంది అభిమానిస్తారు.బాల నటిగా తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించి పాపులారిటీని సంపాదించుకున్న శ్రేష్ట( sreshta ) సమరసింహారెడ్డి సినిమాతో పాటు పలు బ్లాక్ బస్టర్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి పాపులారిటీని పెంచుకోవడం గమనార్హం.

 Baby Sreshta Comments Goes Viral In Social Media Details Here , Sreshta Comment-TeluguStop.com

100కు పైగా సినిమాలలో చైల్ద్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రేష్ట ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.మేజర్ చంద్రకాంత్, ముగ్గురు మొనగాళ్లు, మరికొన్ని సినిమాలలో నటించిన శ్రేష్ట ఉన్నత చదువులు చదవాలని తర్వాత రోజుల్లో సినిమాలకు సంబంధించి బ్రేక్ తీసుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేష్ట మా నాన్నది వరంగల్ అని హైదరాబాద్ లో సెటిల్ కావడం జరిగిందని చెప్పుకొచ్చారు.

చిన్న వయస్సులోనే తాను ఎక్కువగా మాట్లాడేదానినని ఆమె కామెంట్లు చేశారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా నాకు అవకాశాలు రాగా నాన్న మొదట నో చెప్పారని ఆ తర్వాత నాకు ఆసక్తి ఉండటంతో ఏమనలేదని ఆమె తెలిపారు.ఉద్యమం నా మొదటి మూవీ అని శ్రేష్ట అన్నారు.

చెన్నైలో చరణ్ ఇంటికి వెళ్లి ఆడుకున్నానని చరణ్ నాకు ఉప్మా చేసి పెట్టాడని ఆమె తెలిపారు.చరణ్ అలా చేయడం నా లైఫ్ లో మరిచిపోలేని క్షణాలు అని శ్రేష్ట వెల్లడించారు.

సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) రండి కూర్చోండి అని నాతో మాట్లాడేవారని బాలయ్య సమరసింహారెడ్డి నా చివరి మూవీ అని శ్రేష్ట పేర్కొన్నారు.తాను మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ చదివానని శ్రేష్ట చెప్పుకొచ్చారు.సమరసింహారెడ్డి షూట్ పూర్తైన తర్వాత తాను ప్రొడక్షన్ టీమ్ లోని వాళ్లకు వెండి ఉంగరాలు ఇచ్చానని ఆమె అన్నారు.శ్రేష్ట చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube