మనిషి స్వతహాగానే సెంటిమెంటల్.ఈ క్రమంలో తనకు కలిసివచ్చిన ఏ చిన్న వస్తువునైనా భద్రంగా దాచుతుంటాడు.
అలాంటిది ప్రాణాన్ని కాపాడిన కారుని ఎలా చూసుకుంటాడు.అదేంటి కారు ప్రాణాలు కాపాడడం ఏమిటని ఆశ్చర్యం వేస్తోంది కదూ.విషయం తెలియాలంటే ఈ మొత్తం కధనం పూర్తిగా చదవండి.న్యూ కార్ అసెస్ మెట్ ప్రోగ్రాం ప్రకారం, టాటా టియాగో ( Tata Tiago )ప్రస్తుతం మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారుగా చలామణీ అవుతోంది.
ఈ క్రమంలో చాలా మంది టాటా టియాగో యజమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కారు నిర్మాణ నాణ్యతను ఆకాశానికెత్తేయడం జరిగింది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన సత్యప్రకాష్ రెడ్డి( Satya Prakash Reddy ) అనే వ్యక్తి టాటా టియాగో ఓనర్స్ గ్రూప్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు.సత్యప్రకాష్ తన టాటా టియాగో కారును 2020 అక్టోబర్‌లో కొన్నాడు.ఒకరోజు తన ఇద్దరు స్నేహితులతో కలిసి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యంలో ఓ గుంత ఉండడం చేత అతను తన కారుపై నియంత్రణ కోల్పోయి స్టీరింగ్‌ను వేగంగా తిప్పడంతో కారు 4 సార్లు బోల్తా పడింది.
దాంతో కారు పైకప్పు లోపలికి కూరుకుపోయింది.ఈ ప్రమాదం తర్వాత సత్య అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు అతడిని రక్షించారు.

అయితే అదృష్టవశాత్తూ అతనికి పెద్దగా గాయాలు కాలేదు.కేవలం అతని కుడి చేతికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి.అతని ఇద్దరు స్నేహితులు కూడా చిన్నపాటి గాయాలతో క్షేమంగా బయట పడ్డారు.ప్రమాదం తీవ్రత చూస్తే, వేరే బ్రాండ్‌కు చెందిన కారు అయితే తాను బతికేవాడిని కాదని సత్య ఈ సందర్భంగా రాసుకొచ్చాడు.
ఇది జరిగినప్పుడు కారు గంటకు 100 కి.మీ.వేగంతో ఉందని.దీంతో అతను కారుపై నియంత్రణ కోల్పోయాడు అని చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో కారు పక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి దూసుకెళ్లింది.అయినా వారు ప్రాణాలతో బయటపడడానికి కారణం కారు బిల్డ్ క్వాలిటీ అని తెగ మెచ్చుకున్నాడు.
ఆ తరువాత అతను మరో టాటా టియాగోను కొనుగోలు చేసానని చెప్పుకు రావడం జరిగింది.







