ఆ సంతకాల వల్ల ఆస్తులు కోల్పోయిన క్యాస్టూమ్స్ కృష్ణ.. నమ్మకద్రోహం చేయడంతో?

టాలీవుడ్ ప్రముఖ నటులలో క్యాస్టూమ్స్ కృష్ణ( Costumes Krishna ) ఒకరు నటుడిగా, నిర్మాతగా క్యాస్టూమ్ కృష్ణకు మంచి పేరుంది.పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన క్యాస్టూమ్ కృష్ణ రెండు సంతకాల వల్ల ఆస్తులను కోల్పోయారు.

 Costumes Krishna Career Troubles Details, Costumes Krishna, Pellipandiri Movie,-TeluguStop.com

నమ్మిన వాళ్ల చేతిలో మోసపోయి తీవ్రస్థాయిలో నష్టపోయారు.జగపతిబాబు( Jagapati Babu ) హీరోగా నటించిన సినిమాలలో పెళ్లి పందిరి సినిమా( Pellipandiri Movie ) కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు క్యాస్టూమ్స్ కృష్ణ నిర్మాత కావడం గమనార్హం.

ఈ సినిమా మౌత్ టాక్ తోనే హిట్ గా నిలుస్తుందని ఆయన భావించడం జరిగింది.

అయితే ఆయన సన్నిహితులు మాత్రం సినిమా పబ్లిసిటీ కోసం 2 లక్షల రూపాయలు తాము ఖర్చు చేస్తామని చెప్పి క్యాస్టూమ్స్ కృష్ణ దగ్గర రెండు బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు.ఆ పేపర్లలో ఒక డాక్యుమెంట్ లో పెళ్లిపందిరి నెగిటివ్ రైట్స్ వాళ్లకే సొంతమని మరో డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.

ఆస్తులు అమ్మి పెళ్లిపందిరి సినిమా తీసిన క్యాస్టూమ్స్ కృష్ణకు ఆ రెండు డాక్యుమంట్ల వల్ల అప్పులు మిగిలాయి.ఆ తర్వాత క్యాస్టూమ్స్ కృష్ణ సినిమా ఇండస్ట్రీకి దూరంగా మెలిగారు.ఆయన మరణం సినీ ప్రముఖులను ఎంతగానో బాధ పెట్టింది.క్యాస్టూమ్స్ డిజైనర్ గా పని చేయడం వల్ల ఆయనకు క్యాస్టూమ్స్ కృష్ణ పేరు వచ్చింది.విలక్షణమైన గొంతుతో ఆయన పాపులారిటీని ఊహించని స్థాయిలో పెంచుతున్నారు.

అలనాటి నటులలో దాదాపుగా అందరితో కలిసి క్యాస్టూమ్స్ కృష్ణ నటించారు.క్యాస్టూమ్స్ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో వరుసగా సినీ ప్రముఖుల మరణాలు ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతున్నాయి.

తన సినీ కెరీర్ లో క్యాస్టూమ్స్ కృష్ణ వివాదాలకు దూరంగా ఉన్నారు.ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆయన ముందువరసలో ఉండేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube