పల్నాడు జిల్లా వైకుంఠపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెళ్లారు.
ఈ క్రమంలో ఆయనకు ఇసుక రీచ్ లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులు, సోము వీర్రాజుకు మధ్య జరిగిన వాగ్వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది.







