Pooja Bharti : ఖడ్గం సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

డైరెక్టర్ కృష్ణవంశీ ( Krishna Vamsi )దర్శకత్వంలో 2002 లో విడుదల అయిన సినిమా ఖడ్గం( khadgam ).ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బెంద్రే, సంగీత, కిమ్ శర్మ, షఫీ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

 Do You Know How This Heroine Who Acted In The Movie Khadgam Is Now-TeluguStop.com

ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మించారు.దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.దేశ భక్తిని చాటి చెప్తూ కృష్ణవంశీ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్స్ గా సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ( Sonali Bendre, Kim Sharma ) నటించిన విషయం తెలిసిందే.అలాగే ప్రకాష్ రాజ్ కు జోడీగా నటించిన బ్యూటీ గుర్తుందా? ఆ అమ్మడి పేరు పూజాభారతి( Pooja Bharati ).బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి మెప్పించింది పూజా భారతి.తెలుగులో నటించిన ఖడ్గం సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

కానీ ఆ తర్వాత ఆమె తెలుగులో అంతగా రాణించలేకపోయింది.ఇది ఇలా ఉంటే ఖడ్గం సినిమా విడుదల అయ్యి దాదాపు 20 ఏళ్లు పూర్తి అయిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా పూజా భారతి ఎక్కడ ఉంది అని చాలామంది నెటిజన్స్ ఆరాతీయగా ఆమెకు సంబంధించి కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది పూజా భారతి.ఇకపోతే డైరెక్టర్ కృష్ణవంశీ విషయానికి వస్తే.ఇటీవల వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు డైరెక్టర్ కృష్ణ వంశీ.ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube