న్యాచురల్ స్టార్ నాని( Nani ) నటించిన దసరా మూవీ ( బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ వీకెండ్ సమయానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దసరా సినిమాలో కీర్తి సురేష్( Keerthy Suresh ) వెన్నెల రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే.అంగన్ వాడీ టీచర్ గా గుడ్లను దొంగతనం చేసే పాత్రలో ఆమె కనిపించారు.
అయితే అంగన్ వాడీ టీచర్ రోల్ ను అలా చూపించడం తెలుగు రాష్ట్రాల్లోని కొంతమంది అంగన్ వాడీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బ తీస్తుండటం గమనార్హం. అంగన్ వాడీ ఉద్యోగులు తమ మనోభావాలను కించపరిచే సన్నివేశాలను తొలగించాలని కామెంట్లు చేస్తున్నారు.
అలా చేయని పక్షంలో సినిమాను నిలిపివేస్తామని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

అయితే నాని ఫ్యాన్స్ మాత్రం అంగన్ వాడీ ఉద్యోగులంతా దొంగలు అనేలా సినిమాలో చూపించలేదని అనవసర వివాదాలను సృష్టించవద్దని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దసరా యూనిట్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.దసరా సినిమా కలెక్షన్ల విషయంలో బయ్యర్లు, నిర్మాతలు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

నాని దసరా సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకున్నారు.నాని కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈ సినిమా కోసం తీసుకున్నారు.నిర్మాత సుధాకర్ చెరుకూరికి ఈ సినిమా మంచి లాభాలను అందిస్తోంది.దసరా సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాతో నాని, కీర్తి సురేష్ లకు అవకాశాలు పెరగడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాని, కీర్తి సురేష్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో పాటు కొత్త ఆఫర్లు సైతం పెరుగుతున్నాయి.







