యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట సీఐగా విధులు నిర్వహిస్తున్న మోతీరాం పెద్ద అంబర్ పేట వద్ద ఆగి ఉన్న కారులో ఓ వ్యక్తికి గుండెపోటు రావడం గమనించి కారులోంచి బయటికి తీసి ఘటనా స్థలంలో సీపీఆర్ చేశారు.
స్పృహలోకి వచ్చిన అనంతరం హుటాహుటిన బాధితున్ని ఆస్పత్రికి తరలించి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్నారు.
సీఐ మోతీరాం స్పందించిన తీరుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.







