Chamkeela Angeelesi : ట్రెండ్ అవుతున్న చమ్కీల అంగిలేసి సాంగ్.. అదుర్స్ అనిపిస్తున్న బాలిక?

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో రీల్స్ ఫోటో షూట్ లు చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ ని సంపాదించుకుంటున్నారు.ఇప్పటికే ఎంతోమంది టిక్ టాక్ లు సోషల్ మీడియా( Social media ) ద్వారా భారీగా క్రేజ్ ని ఏర్పరచుకొని ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తున్న విషయం తెలిసిందే.

 Chamkila Angilesi Song Reel Girl Keerthi Siri Trending In Social Media-TeluguStop.com

ఇప్పటికే తెలుగు బుల్లితెరపై ఆషురెడ్డి, దుర్గారావు, ఆవేశం స్టార్, భాను ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.తాజాగా కూడా మరో అమ్మాయి సోషల్ మీడియాలో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకొని ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఆ అమ్మాయి పేరు కీర్తి సిరి( keerthi siri )దసరా సినిమాలోని చమ్కీల అంగీలేసి( Chamkeela Angeelesi ) పాటకు పాటకు స్టెప్పులు వేసి భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ కీర్తి సిరి పేరే వినిపిస్తోంది.దసరా సినిమాలోని పాటకు చేసిన ఒక రీల్ వీడియోతో ఈమెకు ఇంస్టాగ్రామ్ లో భారీగా ఫ్యాన్స్ పెరిగిపోయారు.ఒక్కసారిగా ఆమెకు ఏర్పడిన ఫ్యాన్స్ బేస్ ని చూసి నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.

తాజాగా కీర్తి కారులో వెళుతూ ఆ పాటకు రిలీజ్ చేసింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతేకాకుండా ఆ రీల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.ఆ పాటతో ఓవర్ నైట్ లో స్టార్ డంను సంపాదించుకొని ఇంస్టాగ్రామ్ లో 68.8kఫాలోవర్స్ ని సంపాదించుకుంది.అయితే ఆ పాట వేయకముందు ఈమెకు సోషల్ మీడియాలో 3,000 మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు.

కీర్తిడాన్సర్ కూడా.అంతేకాకుండా కిట్టమ్మ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తోంది కీర్తి సిరి.

కీర్తి తో పాటు ఎంతోమంది ఈ పాటకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో చేసినప్పటికీ కీర్తి సిరి మాత్రం భారీగా క్రేజీ ని ఏర్పరచుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube