సోషల్ మీడియా(Social media )లో మనం బాగా గమనించినట్లయితే ఎక్కువగా చిన్న పిల్లలకు చెందినటువంటి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో ఎక్కువగా అమ్మాయిల ఫ్యాషన్‌కు సంబంధించిన వీడియోలు ఉంటాయి.
మేకప్ అనే పదానికి పెట్టింది పేరు అమ్మాయిలు అని వేరే చెప్పాల్సిన పనిలేదు.తల్లులు మేకప్ చేసుకుంటే సైలెంట్ గా పిల్లలు చూస్తూ ఫాలో అయిపోతూ వుంటారు.
ఈ క్రమంలోనే ఓ పాప మేకప్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఆ వీడియోలో మేకప్ వేసుకున్న చిన్నారిని చూస్తే.
మీకు మీ పిల్లలు గుర్తుకు రావడం పక్కా.
వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే… ఒక పాప తన తల్లి మేకప్ కిట్ ని దొంగ చాటున వాడేయడం గమనించవచ్చు.
ఆ పాపకి లిప్ స్టిక్( Lipstick ) అంటే ఇష్టమేమో మరి.దాన్ని తీసుకొని తన ముఖమంతా పులుముకుంటుంది.దువ్వెనను అద్దంలాగా పట్టుకుంటూ అందులో తన ముఖాన్ని చూసుకుంటూ ఆ పాప అలా ఎర్రని లిప్ స్టిక్ తన ముఖానికి రాసుకోవడాన్ని చూసి నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చావు పిల్లా అని ఒకరంటే… మా పిల్లలు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తారు అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇన్‌స్టా( Instagram ) ఖాతా నుంచి షేర్ కాబడ్డ ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడం గమనించవచ్చు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిన్నారి ప్రయత్నాన్ని చూసి నవ్వుకుంటున్నారు.కాగా ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 6 లక్షల 1 వేయికి పైగా లైకులు రావడం కొసమెరుపు.అంతేనా… వ్యూస్ అయితే లెక్కేలేదు.దాదాపు 29 లక్షల 21వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
అంతేకాకుండా 7 వేలకు పైగా నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ చేయడం విశేషం.కొంతమందైతే ‘రానున్న కాలంలో ఆమె గొప్ప మేకప్ ఆర్టిస్ట్ అవుతుంద’ని కామెంట్ చేసాడు.







