టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram charan ) నేడు పుట్టినరోజు ( Birthday ) జరుపుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈయనకు అభిమానులు సినిమా సెలబ్రిటీలనుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఇలా సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక మంచు మనోజ్( Manchu Manoj ) సైతం సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు స్పెషల్ విషెస్ తెలియజేశారు.ప్రస్తుతం మనోజ్ చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నటువంటి మనోజ్ తాజాగా విష్ణుతో గొడవ పడి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలు నిలిచారు.

ఇలా విష్ణుతో గొడవ పడటానికి గల కారణం ఏంటి అనే విషయం తెలియకపోయినా ఈ గొడవ తర్వాత ఈయన సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన అక్క లక్ష్మీ ప్రసన్న( Lakshmi Prasanna ), రామ్ చరణ్ ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ రామ్ చరణ్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా మనోజ్ రామ్ చరణ్ ను మై స్వీటెస్ట్ బ్రదర్ అంటూ సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.మై స్వీటేస్ట్ బ్రదర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు సూపర్ డూపర్ పుట్టినరోజు శుభాకాంక్షలు.ఇలా నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నాను మిత్రమా… లాట్స్ ఆఫ్ లవ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా# HBD Global Star Ram Charan అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు.ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ పోస్ట్ చూసినటువంటి మంచు ఫాన్స్ సైతం రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.







