తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు రావు గోపాల రావు,కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ లాంటి చాలా మంది విలన్లు చాలా సంవత్సరాల పాటు మంచి సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ల తర్వాత చాలా మంది విలన్లు వచ్చారు.అందులో కోట శ్రీనివాస రావు ( Kota Srinivasa Rao )లాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
ఇక ఈ జనరేషన్ లో విలన్స్ అంటే ప్రకాష్ రాజ్( Prakash Raj ) పేరు మొదటగా గుర్తుకు వస్తుంది, ఇక ఆయన తర్వాత అంతటి విలనిజాన్ని పండించాలి అంటే అది సోనూసూద్( Sonusood ) తో మాత్రమే అవుతుంది అనే చెప్పాలి…
సూపర్ లాంటి సినిమాతో తెలుగులో ఒక మంచి పాత్ర పోషించిన సోను ఆ తరువాత చాలా సినిమాల్లో విలన్ గా కనిపించాడు.కానీ ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అయితే అరుంధతి( Arundhati ) అనే చెప్పాలి ఆ సినిమా లో చేసినందుకు అనుష్క ఎంత పాపులర్ అయింది అంటే ఆమె కి ఎంత మాత్రం తగ్గకుండా సోనుసూద్ కూడా చాలా బాగా చేసి పాపులర్ అయ్యాడు…

ఈ సినిమాలో ఆయన పోషించిన పశుపతి పాత్ర కి చాలా మంచి పేరు దక్కింది.ఆ క్యారెక్టర్ లో ఆయన చెప్పిన అమ్మ బొమ్మాళి అనే డైలాగ్ అయితే చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలివాళ్ల దాకా అందరూ చెప్పారు… అలా ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో సోను సూద్ చాలా సినిమాల్లో విలన్ గా చేశాడు…జులాయి, ఏక్ నిరంజన్,దూకుడు లాంటి సినిమాల్లో విలన్ గా చేసి విలనిజాన్ని బాగా పండించాడు అనే చెప్పాలి…అయితే ఆ మధ్య ఆయనని హెల్ప్ అడిగిన ప్రతి ఒక్కరికీ తన స్థాయి కి మించి హెల్ప్ చేశాడు.అలాగే కరోనా టైం లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు…ఒక టైం లో అయితే ఆయనే దేవుడు అని జనాలు ఆయన్ని చాలా రకాలుగా నమ్మడం స్టార్ట్ చేశారు…

ఇక ఇది ఇలా ఉంటే ఆయన ప్రస్తుతం ఏ సినిమాలో కూడా నటించడం లేదు, ఎందుకంటే ఆయనకి జనాల్లో ఒక మంచి ఇమేజ్ ఉంది.దాని వల్ల ఆయన సినిమాల్లో విలన్ గా చేస్తే రౌడీ ని, హీరో ఎలాగైనా కొడతాడు కాబట్టి అలా ఆయన్ని కొట్టడం ఆడియన్స్ కి నచ్చదు అలా చేస్తే సినిమా ఎంత బాగున్నా, అంత రీచ్ రాదు కాబట్టి అందరూ సోనుసూద్ గారిని తీసుకోవడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు…
.