ముఖ్యంగా చెప్పాలంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆడ మగ అని తేడా లేకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు.ఇంకా చెప్పాలంటే 40 సంవత్సరాలు దాటిన ఆడవారు అనారోగ్య ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.40 సంవత్సరాలకు మహిళలు మెనోపాజ్ దశలోకి అడుగు పెడతారు.అటువంటి సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా కొన్ని సమస్యలు వస్తాయి.
అవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు, లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.ఇవి కనుక మీరు గమనిస్తే ప్రమాదకరమైన రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ మంది ఆడవారు ఎదుర్కొంటున్న సమస్యలలో కిడ్నీలలో రాళ్ల సమస్య( Kidney stone ) ఎక్కువగా ఉంది.వయసు పెరిగేకొద్దీ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సాధారణంగా మూత్రపిండాలలో రాళ్లు ఎక్కువగా పురుషుల్లో వస్తాయని అనుకుంటారు.కానీ ఈ మధ్య కాలంలో స్త్రీలలో కూడా ఈ సమస్య అధికంగానే కనిపిస్తుంది.
వెన్నులో విపరీతమైన నొప్పి, మూత్రంలో రక్తం, జ్వరం, చలి, వాంతులు, ముత్ర దుర్వాసన, మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం వల్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇంకా చెప్పాలంటే ఎముకలు బలహీనంగా చేసే మరొక జబ్బు ఆర్థరైటిస్( Arthritis ) 40 సంవత్సరాలు దాటిన ఆడవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.ఎముకల్లో క్షీణత, కీళ్ల లో నొప్పి, దృఢత్వం కోల్పోవడం, మోకాళ్లలో విపరీతమైన నొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత రోజులలో యువత కూడా మధుమేహం బారిన పడుతున్నారు.40 సంవత్సరాలు దాటిన ఆడవారిలో మధుమేహం ముప్పు పెరుగుతుంది.అలసట, విపరీతమైన దాహం, ముత్ర విసర్జన పెరగడం, చూపు మందగించడం, బరువు తగ్గడం, చిగుళ్ల వ్యాధులు వంటివి మహిళలలో మధుమేహనీకి ముందు వచ్చే లక్షణాలు.
ముఖ్యంగా చెప్పాలంటే వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు దాదాపు చాలామందిలో ఉబకాయం( Obesity ) సమస్య కనిపిస్తూ ఉంది.మహిళలు ఊబకాయం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.బాడీ మాస్ ఇండెక్స్ పై దృష్టి పెట్టడం ఎంతో అవసరం.40 సంవత్సరాలు తర్వాత మహిళలు బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.పెరిమెనోపాసల్ హార్మోన్ల పనితీరు తగ్గడం వల్ల ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.