తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వైఎస్ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ కు సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేశారని తెలుస్తోంది.న్యాయస్థానం తన వాదనలు కూడా వినాలని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.







