RRR: చెర్రీ, తారక్, రాజమౌళి ఆస్కార్ పాస్ ల కోసం అంత ఖర్చు చేసారా?

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.( RRR ) విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది.

 Rajamouli Jr Ntr Ram Charan Not Getting Free Pass For Oscar 2023 Event-TeluguStop.com

అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా గుర్తింపును తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ప్రసారమవుతూ రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది.

ఈ సినిమా ఆస్కార్ అవార్డును( Oscar ) సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.దీంతో తెలుగు సినీ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Telugu Chandrabose, Jr Ntr, Mm Keeravani, Naatu Naatu, Oscar, Rajamouli, Ram Cha

ఇది ఇలా ఉంటే అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకల కోసం హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, కాలభైరవ తదితరులు పాల్గొన్న విషయం తెలిసిందే.వీరికి అక్కడ గ్రాండ్ వెల్ కమ్ కూడా చెప్పారు.95వ ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో తెలుగు నేల సత్తా చాటింది.ఆస్కార్ వేడుకను ముగించుకొని ఆర్ఆర్ఆర్ టీమ్ హైదరాబాద్ కు తిరిగొచ్చింది.

అయితే తాజాగా ఈ వేడుక పాసెస్ ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.అదేమిటంటే ఆస్కార్ వేడుకకు ఆర్ఆర్ఆర్ టీమ్‌లో అందరికీ ఫ్రీ ఎంట్రీ దక్కలేదట.

Telugu Chandrabose, Jr Ntr, Mm Keeravani, Naatu Naatu, Oscar, Rajamouli, Ram Cha

కేవలం ఈ సాంగ్ రైటర్ చంద్రబోస్‌కు, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి వారి భార్యలకు మాత్రమే నిర్వాహకులు ఫ్రీ పాస్ ఇచ్చారట.ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్ చరణ్, ఉపాసన, ఎన్టీఆర్ సహా ఇతర యూనిట్ మొత్తం కూడా పెయిడ్ పాస్ తోనే ఆస్కార్ ప్రాంగణంలో అడుగుపెట్టారట.అందుకోసం ఒక్కో టికెట్ ఏకంగా 25 వేల అమెరికన్‌ డాలర్స్ అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 20.6లక్షలు ఖర్చు చేశారట.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్, ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube