అమెరికాలో ప్రొఫెసర్లను బెదిరించిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే.
నిందితుడిని అర్విన్ రాజ్ మాథుర్‌గా గుర్తించారు.ఇతనిని గత శుక్రవారం డెట్రాయిట్ మెట్రోపాలిటిన్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసినట్లు ది డెట్రాయిట్ న్యూస్ నివేదించింది.
ఇతనిని మిచిగాన్‌లోని సెయింట్ క్లెయిర్ కౌంటీ జైలులో ఉంచినట్లు నివేదిక పేర్కొంది.ఈ నేరానికి సంబంధించి మాథుర్‌ను ఈరోజు విచారించనున్నారు.
ఆంత్రోపాలజీ డిపార్ట్‌మెంట్‌లో మాజీ గ్రాడ్యుయేట్ అయిన మాథుర్.కోర్ట్‌కు సమర్పించిన రికార్డుల ప్రకారం ఇతను అమెరికాకు వెలుపల వుండి, ఆ దేశానికి చెందిన తొమ్మిది మందిని బెదిరించాడు.ఈ మేరకు వారికి ఈ మెయిల్స్ చేశాడు.అరెస్ట్ తర్వాత ఆయన శనివారం డెట్రాయిట్‌లోని ఫెడరల్ కోర్టులో ప్రాథమిక విచారణకు హాజరయ్యాడు.
నిందితుడు విస్కాన్సిన్, మాడిసన్ యూనివర్సిటీలకు చెందిన విద్యార్ధులు, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశాడు.మీ పిల్లల మాంసాన్ని బర్గర్‌లో పెడతానంటూ అతను చేసిన ఈ మెయిల్స్ కలకలం రేపాయి.
అలా మొత్తం 9 మందిని మాథుర్(Arvin Raj Mathur) బెదిరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదిలావుండగా.హత్యకు కుట్ర పన్నిన కేసులో అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన భారత సంతతికి చెందిన నేత రాజ్‌వీర్ సింగ్ గిల్(Rajvir Raj Singh Gill)ను కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.గత వీకెండ్‌లో బేకర్స్‌ఫీల్డ్‌లోని అతిపెద్ద గురుద్వారా షహీద్ బాబా దీప్ సింగ్ జీ ఖల్సా దర్బార్ సభ్యులను కాల్చిచంపడానికి షూటర్లను నియమించారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బేకర్స్‌ఫీల్డ్ అనేది కాలిఫోర్నియా(California) రాష్ట్రంలోని కెర్న్ కౌంటీలోని ఒక నగరం.గిల్‌పై పోలీసులు ఆరు నేరారోపణలు మోపారు.అయితే ఆయనను తర్వాత విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.
గతేడాది నవంబర్‌లో జరిగిన వార్డు ఎన్నికల్లో పోటీ చేసిన గిల్ 7 శాతానికిపైగా ఓట్లను సాధించారు.అయితే ఇటీవలి కాలంలో గురుద్వారా వద్ద రాజ్‌వీర్ సింగ్ పలుమార్లు కనిపించారని , ప్రార్థనలకు అంతరాయం కలిగించాడని, కమ్యూనిటీ మెంబర్లను బెదిరించాడని గురుద్వారా పెద్ద మీడియాకు తెలిపారు.అంతేకాకుండా పోలీసులు అతనిని అరెస్ట్ చేయడానికి ముందు కూడా తుపాకీని వెంటే వుంచుకున్నాడని తెలుస్తోంది.