సోషల్ మీడియా అంటే ఏమిటో తెలియని వారు దాదాపుగా వుండరు.ఈరోజుల్లో చిన్నా, పెద్ద అనే తేడాలేకుండా వాడేది స్మార్ట్ ఫోన్.
దీని వాడకం పెరిగాక వయసుతో సంబంధం లేకుండా అందరూ కంటెంట్ క్రియేటర్లుగా మారిపోయారు.పట్టుమని పదేళ్లు కూడా లేని చిన్నారుల సైతం ఇపుడు కంటెంట్ క్రియేటర్లుగా మారిపోతున్నారు అంటే, వారు ఎంత ఫాస్ట్ గా అప్డేట్ అవుతున్నారో చూడండి! ఈ క్రమంలోనే “ఐ యామ్ చోటి” అనే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక చిన్నారి చాలా ఫన్నీగా వీడియోలు చేస్తోంది.
ఇక తాజాగా ఆమె చేసిన పానీపూరి వీడియో సోషల్ వీడియోలో తెగ హల్ చల్ చేస్తోంది.
స్ట్రీట్ పుడ్ లో పానీపూరిది చాలా ప్రత్యేక స్థానం అని చెప్పుకోవాలి.
ఎందుకంటే దీనిని పిల్లల నుంచి పెద్దవారు వరకూ చాలా ఇష్టంగా తింటూ వుంటారు.ముఖ్యంగా అమ్మాయిలకు పానీపూరీ అంటే ప్రాణప్రదం అని చెప్పుకోక తప్పదు.
ఈవినింగ్ స్నాక్స్ అంటే వారికి పానీపూరీ ఉండాల్సిందే.ఫ్రెండ్స్ తో గాని, గర్ల్ ఫ్రెండ్స్ తో గాని వారు మొదటగా తినాలనుకొనేది పానీపూరీ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.అయితే పానీపూరీని ఇంగ్లిష్ లో ఏమని పిలుస్తారో తెలుసా? అసలు పానీపూరీకి ఇంగ్లిష్ పేరు ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా?

అలోచించి వుండరు కదా! ఆ విషయం తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.ఈ వీడియోలో ఓ చిన్న అమ్మాయి పానీపూరీకి ఇంగ్లీష్‌లో చాలా ఫన్నీగా అర్థం చెబుతోంది.ఆ పేరు వింటే మీరు తప్పకుండా నవ్వాల్సిందే.ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో i_am_choti97 అనే IDతో షేర్ చేయబడగా ఇప్పటివరకు 26 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ ను 7 లక్షల 47 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ‘చిన్నారి చెల్లి కరెక్ట్ గా చెప్పింది ఇలానే పిలవండి అని కామెంట్ చేయడం విశేషం.







