ప్రస్తుతం మన దేశంలోనూ, ప్రపంచంలోనూ షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకి,రోజుకి క్రమంగా పెరుగుతూ ఉంది.ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
ఒకసారి షుగర్ సోకిందంటే అది పూర్తిగా నయమైపోదు.మన జీవన శైలితో పాటు దాన్ని అదుపులో ఉంచుకోవాలి.
అందుకే ఈ వ్యాధి పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.అయితే అనేక ఇంటి నివారణ ద్వారా చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.
అందులో ఒకటి నేరేడు పండు నేరేడు పండు.నేరేడు పండు తీపి కొద్దిగా పులుపు, రుచిలో కొద్దిగా వగరు గా ఉంటుంది.
నేరేడు పండు గురించి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది.ఇందులో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, బి, సి ఎక్కువగా ఉంటాయి.
ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.నేరేడు పండు తినడం వల్ల మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.చక్కర వ్యాధి గ్రస్తులు ఈ పండును ఆహారంలో చేర్చుకుంటే వారి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆహారంలో నేరేడు పండు ఎలా చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా నేరేడు పండు గింజలను నీటిలో బాగా కడిగి అరబెట్టాలి.గింజలు ఆరిపోయాక గ్రైండర్ లో వేసి గ్రైండ్ చేయాలి.
ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో పాలలో ఒక చిన్న చెంచా పొడిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇలా రోజు చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
దీంతో పాటు పొట్ట సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.నేరేడు పండు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
దీని బెరడును కాషాయం చేసి తాగితే కడుపు నొప్పి అజీర్తి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.