ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.మొదటిసారిగా దిల్ రాజు తన కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ని విడుదల చేయకపోగా ఆ సినిమాకు సీఈవో అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.ఈ సినిమా టైటిల్ విడుదల తేదీలను ఉగాది పండుగకు లేదంటే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.వచ్చే ఏడాది ఎలా అయినా సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అని బాగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
దర్శకుడు చిత్ర బృందం మొత్తం అదే పనిలో ఉన్నట్లు తెలిపారు దిల్ రాజు.అలాగే వేణు తో మరో సినిమా తన బ్యానర్లో తీస్తున్నానని తెలిపారు.అది పెద్ద సినిమా అని స్పాన్ ఉన్న సినిమా అని వెల్లడించారు దిల్ రాజు.వేణు శ్రీరామ్తో సినిమా ఫిక్స్ అయిందని త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాము అని తెలిపారు దిల్ రాజు.

రాజకీయాలలోకి వస్తానని వార్తలు వినిపిస్తున్నాయి ఆ విషయం గురించి ప్రస్తుతం చెప్పలేను.నాకు ఎంతోమంది బంధువులు అన్ని పార్టీల్లో పదవుల్లో ఉన్నారు.అదేవిధంగా స్నేహితులు కూడా ఉన్నారు.అయితే డైరెక్షన్ చేయాలని మాత్రం నేను ఇప్పటికీ అనుకోను అని తెలిపారు.ఈ విషయంపై గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా దిల్ రాజు వ్యాఖ్యలతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.
ఇకపోతే ఈ మధ్యకాలంలో ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో దిల్ రాజు పేరు వినిపిస్తూనే ఉంది.సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా హైలెట్ అవుతున్నారు దిల్ రాజు.







