మీరే ఒంటరిగా మిగిలిపోతున్నారు.. పశ్చిమ దేశాలకు రష్యా చురక!

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, యూరప్ దేశాలు రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేస్తున్నాయి.

 You Will Remain Alone Russias Sergey Lavrov To Western Countries Ag G20 Summit D-TeluguStop.com

అయితే సైనికంగా, ఆర్థికంగా బలమైన రష్యా వాటి కుయుక్తులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోంది.తాజాగా జీ-20 సమావేశాలు భారత్‌లో జరిగాయి.

వాటిలో పశ్చిమ దేశాల వైఖరిని రష్యా ఖండించింది.తమను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తూ, మీరే ఒంటరి అయిపోతున్నారని వ్యాఖ్యనించింది.

దీనికి సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

బెంగళూరులో జి -20 ఆర్థిక మంత్రుల సమావేశం ముగిసింది.ఉమ్మడి ప్రకటనలపై రష్యా, చైనా అంగీకరించనందున, జి 20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సంయుక్త ప్రకటన విడుదల చేయకుండా ముగిసింది.ఈ సమావేశాల్లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కీలక ప్రకటన చేశారు.జీ20 కార్యకలాపాలను పాశ్చాత్య దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఘర్షణ కోణం నుండి ఉపయోగించబడుతుందని ఆరోపించారు.

రష్యాపై యుద్ధానికి పశ్చిమ దేశాలు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయన్నారు.ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని అందిస్తున్నాయన్నారు.ఆ దేశాలు ప్రపంచ దేశాల ప్రయోజనాలను పక్కన పెట్టి, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నాయన్నారు.దౌత్యపరమైన విధానాలకు స్వస్తి చెప్పి బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నాయన్నారు.జీ-20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత్ ప్రపంచ దేశాల పరిస్థితులపై చక్కగా అంచనా వేసిందన్నారు.ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు చోటు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube