పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి.అందులో ఒక రీమేక్ సినిమా కూడా ఉన్న విషయం తెలిసిందే.
కొన్ని రోజుల క్రితం ఈ సినిమా అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినోదయ సీతం రీమేక్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా.
పవన్ కళ్యాణ్ గెస్ట్ అపీరెన్స్ లో కనపడనున్నారు.
అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే నుండే షూట్ కూడా స్టార్ట్ చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చారు.
పీపుల్స్ మీడియా బ్యానర్ పై వివేక్ కూచిభట్ల, టిజి విశ్వప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు.
కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ళ భరణి వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుగుతుండగా అప్పుడే ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి.తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.పవన్ కళ్యాణ్ ఇందులో దేవుడి పాత్రలో కనిపిస్తుండగా.
పవన్ సాయి తేజ్ లపై ఒక సాంగ్ కూడా మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలిసింది.అసలైతే ఒరిజినల్ వర్షన్ లో సాంగ్స్ లేనప్పటికీ తెలుగు వర్షన్ లో మాత్రం త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను అలా సిద్ధం చేశారట.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను మన తెలుగు నేటివిటీకి తగ్గుట్టుగా మార్పులు చేర్పులు చేశారట.అందుకే రిలీజ్ తర్వాత ఈ సినిమా అందరి అంచనాలకు మించే ఓ రేంజ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది.మరి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కు తగ్గట్టుగా ఈ సినిమాలో ఎలాంటి మార్పులు చేసారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.