టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.ఇకపోతే రామ్ చరణ్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం చెర్రీ తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.కాగా రామ్ చరణ్ గత వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.అక్కడ స్థానిక మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు చెర్రీ.ఇక చరణ్ ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో లైవ్ నిర్వహిస్తూ ఉంటాడు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్ తాను టీనేజ్లోఉన్న సమయంలో జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా జోన్స్ అంటే క్రష్ అని తెలిపారు.
ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ తనకి ఇష్టమైన సినిమాల గురించి చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.
నాకు నచ్చిన చిత్రాల్లో ది నోట్‌బుక్ ఒకటి.ఆ తరువాత టెర్మినేటర్ 2 ఈ సినిమాను నేను ఎల్‌ఈడీ డిక్స్‌లో యాభై సార్లు చూసాను.
అది నాకు చాలా నచ్చింది.అలాగే గ్లాడియేటర్.
నాకు చాలా ఇష్టమైన వాటిలో ది ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ మరింత ఫేవరేట్ అని అని తెలిపారు రామ్ చరణ్.ఆ తర్వాత తెలుగులో తనకి ఇష్టమైన నాలుగు సినిమాల గురించి మాట్లాడుతూ మొదటిది దానవీరశూరకర్ణ, రెండవది బాహుబలి, మిస్టర్ ఇండియా, నాలుగవది నేను నటించిన రంగస్థలం సినిమా.
ఈ నాలుగు తెలుగు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అని తెలిపారు రామ్ చరణ్.