తెలుగు సినీ ప్రేక్షకులకు నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట అల్లరి నరేష్ సీమటపాకాయ్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలాగే అవును, అవును2 సినిమాల ద్వారా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో నటించి భారీగా క్రేజ్ ని సంపాదించుకుంది.
ఇకపోతే ఈమె ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెర షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ అప్పుడప్పుడు జబర్దస్త్ షో కి కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటుంది పూర్ణ.కాగా దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం పూర్ణ ప్రెగ్నెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ప్రెగ్నెంట్ కావడంతో ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది పూర్ణ.కాగా ఇటీవలే పూర్ణ తన సీమంతం జరిగిన విషయం తెలిసిందే.
అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా పూర్ణ తనం ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన కొన్ని ఫోటోల గురించి అభిమానులు నటిజన్స్ చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పూర్ణ షేర్ చేసిన ఫోటోల్లో ఓ తెల్లటి వస్త్రాన్ని నడుముకు చుట్టుకుని నల్లటి దారాన్ని కట్టుకుంది.ఈ పిక్స్ చూసిన అభిమానులు నిండు గర్భిణీగా ఉన్న పూర్ణకు ఏమైంది అని ఆందోళన చెందడంతో ఆ ఫొటోస్ గురించి వివరణ ఇచ్చింది పూర్ణ.ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి ఆచారంలో గర్భిణీలకు ఏడో నెల వస్తే కానూర్ అనే సంప్రదాయ తంతును నిర్వహిస్తారట.ఆ ఆచారంలో భాగంగానే పూర్ణ తెల్లటి వస్త్రాన్ని ఇలా నడుముకు చుట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది పూర్ణ.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.







