పేద విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న అలీ... మంచి మనసంటూ ప్రశంసలు?

ప్రముఖ హాస్య నటుడు అలీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విషయం మనకు తెలిసింది.ఇలా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఈయన రాజకీయాలలో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు.

 Comedian Ali Took A Great Decision For The Poor Students Details, Ali , Poor Stu-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలోను కొనసాగుతున్నటువంటి అలీ చదువుకోవడానికి డబ్బులు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పేద విద్యార్థుల కోసం తనదైన శైలిలో సహాయం అందించడానికి సిద్ధమయ్యారు.

Telugu Ali Heart, Arvens Company, Poor, Vishnu Reddy-Movie

తెలుగు రాష్ట్రాలలో పేద విద్యార్థులకు అండగా నిలవడం కోసం అలీ ఆస్ట్రేలియాకి చెందిన అర్వేన్సిస్‌ కంపెనీ నిర్వహకులతో చేతులు కలిపి వారిని ఇండియాకి తీసుకువచ్చారు.అదేవిధంగా అర్వేన్సిస్‌ కంపెనీకి తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.ఈ క్రమంలోనే మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అలీ మాట్లాడుతూ తాను గతేడాది ఓ కార్యక్రమం కోసం గెస్ట్‌గా పిలిస్తే ఆస్ట్రేలియా వెళ్లాను.అక్కడ మన తెలుగు వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద నిలబడి ఎందరికో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను.

Telugu Ali Heart, Arvens Company, Poor, Vishnu Reddy-Movie

ఆ రోజు అక్కడున్న మన తెలుగువారు విష్ణురెడ్డి, శశి కొలికొండను పిలిచి అడిగాను.మీరు ఆస్ట్రేలియాలో ఉండి ఇంతమంచి చేస్తున్నారు కదా, అదేమంచి మన తెలుగువారికి కూడా చేయొచ్చు కదా అని అడగగా మరుసటి రోజు వాళ్ళు నాతో మాట్లాడటంతో వారికి కొన్ని సలహాలు సూచనలు చేశాను అయితే ఇప్పుడు ఏకంగా 60 మందితో వాళ్లు ఇండియాకి వచ్చి ఇక్కడ పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.ఇక వీరితో కలిసి తన వంతు సాయంగా పేద విద్యార్థులను చదివించడానికి సహాయం చేయబోతున్నానని అందుకే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నానంటూ అలీ తెలియజేశారు.

ఇలా పేద విద్యార్థుల కోసం ఆలీ ఒక అడుగు ముందుకు వేయడంతో ఎంతోమంది అలీ మంచి మనస్తత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube