స్వదేశంలో 200వ అంతర్జాతీయ మ్యాచ్.. 22 పరుగులతో నిరాశపరచిన విరాట్ కోహ్లీ..!

బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇండోర్ స్టేడియంలో జరిగే ఇండియా- ఆస్ట్రేలియా మూడవ టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైనది.స్వదేశంలో 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ అభిమానులను నిరాశపరచాడు.

 200th International Match At Home.. Virat Kohli Disappointed With 22 Runs., Vir-TeluguStop.com

భారత జట్టు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో సరికొత్త ఆట ప్రదర్శించి, మూడవ టెస్టులో బోల్తా పడింది.ఆస్ట్రేలియా బౌలర్ల దాడిని సమర్థవంతంగా ఎదురుకోలేకపోయింది.

తొలి ఇన్నింగ్స్ లోనే స్కోరు చేయకుండా వరుసగా వికెట్లు కోల్పోయింది ఇండియా.ఇక కోహ్లీ 22 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్లో ఎల్బీ గా వెనిదిరిగాడు.2020 నుంచి అతడు టెస్ట్ మ్యాచ్ లలో సెంచరీ నమోదు చేయలేదు.2020లో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడి కేవలం 116 పరుగులు చేశాడు. 2021లో 11 మ్యాచుల్లో 536 పరుగులు, 2022లో ఆరు మ్యాచ్లలో 265 పరుగులు చేశాడు.

భారత జట్టు విషయానికి వస్తే 33.2 ఓవర్లలో 109 పరుగులు చేసి, ఆల్ అవుట్ అయింది.ఏ ఒక్కరు కూడా ఆఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు.

రోహిత్ శర్మ (12), శుబ్ మన్ గీల్ (21), పూజార (1), కోహ్లీ (22), జడేజా (4) శ్రేయస్ ఆయ్యర్ (0) భరత్ (17), అక్షర పటేల్ (12), రవిచంద్రన్ అశ్విన్ (3), ఉమేష్ యాదవ్ (17), మహమ్మద్ సిరాజ్ (0) పరుగులు చేసి అవుట్ అయ్యారు.

మూడవ టెస్ట్ మ్యాచ్ ను సీరియస్ గా తీసుకున్న ఆస్ట్రేలియా రెండు రోజుల క్రితం పిచ్ రోలర్, డబ్బాలతో చేసిన ప్రాక్టీస్ మంచి ఫలితాన్ని అందించింది.రెండు టెస్ట్ మ్యాచ్ లలో అద్భుత ఆటను ప్రదర్శించిన

రోహిత్ సేన

అతి దారుణంగా వికెట్లు కోల్పోవడం క్రికెట్ ప్రేక్షకులకు నిరాశ మిగిల్చింది.ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ చక్కగా బాధ్యతలు నిర్వహించాడు.

మాథ్యూ కున్హేమన్ ఐదు వికెట్లు, నాథన్ లయోన్ 3 వికెట్లు, మర్ఫీ 1 వికెట్ తీశారు.ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను, రోహిత్ సేన ఎలా తిప్పి కొడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube