స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఇప్పుడు ఐకాన్ స్టార్ అయిపోయాడు సుకుమార్ పుణ్యమా అని అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో అయిపోయాడు మొత్తానికి ఇప్పుడు ఐకాన్ స్టార్ పాన్ ఇండియా హీరో…

అయితే ఒక 10 సంవత్సరాల క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జులాయి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది అప్పటి వరకు ప్లాప్ ల్లో ఉన్న అల్లు అర్జున్ కి ఇది మంచి బుస్టాప్ ఇచ్చింది అనే చెప్పాలి.ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఇది ఇలా వుంటే త్రివిక్రమ్ ఈ స్టోరీ రాసుకున్నప్పుడు ఇందులో హీరోగా అల్లు అర్జున్ గారిని కాకుండా తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య ని పెట్టీ తీద్దాం అని అనుకున్నారట కానీ ఆ టైం కి సూర్య వరుసగా ఒక 4 సినిమాలకి కమిట్ అయి ఉండడం వల్ల త్రివిక్రమ్ చెప్పిన ఈ జులాయి స్టోరీ ని వదులుకోవాల్సి వచ్చిందట దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా అయిన చేయాలి అని సూర్య చూస్తున్నప్పటికి అది వర్క్ ఔట్ అవ్వట్లేదు…

అయితే జులాయి సినిమా మాత్రం అల్లు అర్జున్ కి చాలా కిలమైన సినిమా గా మారింది…ఈ సినిమా తోనే అల్లు అర్జున్ మొదటి సారిగా 40 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు ఇక దీని తరువాత రేసుగుర్రం లాంటి సినిమాతో ఫస్ట్ టైం 50 కోట్ల క్లబ్ లో చేరిపోయారు.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు…








