తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మెడికల్ కాలేజీలు మూతపడ్డాయి.మెడికో ప్రీతి మృతితో ఏబీవీపీ కాలేజీల బంద్ కు పిలుపునిచ్చింది.
ఈ క్రమంలో ప్రీతికి విద్యార్థులు అందరూ కలిసి నివాళులు అర్పించారు.అనంతరం కాకతీయ మెడికల్ కాలేజీని ముట్టడించారు.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకు దిగిన ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరోవైపు తెలంగాణ జూడాలు ప్రీతి మరణానికి సంతాపం ప్రకటించారు.అటు జనగామ జిల్లా గిర్నితండాలో ప్రీతి అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి.







