ఇటీవలే కాలంలో దారుణాలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇంతవరకు కామాంధుల కళ్ళు కేవలం ఆడవాళ్ళ పైనే ఉండేది.
ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన మానవజాతికే అవమానం.ఒక వ్యక్తి మూగజీవిపై అత్యాచారం చేసి తన కామాన్ని తీర్చుకున్నాడు.
బహుశా మానవజాతికి ఇంతకంటే పెద్ద అవమానం మరొకటి ఉండదేమో.దేశ రాజధాని ఢిల్లీలోని హరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఒక పార్కులో ఆడ కుక్కపై ఒక వ్యక్తి అత్యాచారం చేస్తుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఫిబ్రవరి 25న స్థానిక ప్రజలు హరి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా,

ఫిబ్రవరి 26వ తేదీ సెక్షన్ 377/11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇక పోలీసులు ఆ వీడియో ఎప్పుడు తీయడం జరిగింది.మూగ జీవి పై అత్యాచారం చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.తాజాగా యానిమల్ యాంటీ క్రూయెల్టీ సెల్ ఆఫీసర్ తరుణ్ అగర్వాల్ ఈ వీడియో పై ట్విట్టర్లో స్పందిస్తూ, మొదట పోలీసులు ఫిబ్రవరి 25న ఈ సంఘటనపై కేసు నమోదు చేయలేదని, అధికారం లో ఉండే వ్యక్తుల బాధ్యత ఏమిటని ప్రశ్నిస్తూ, అధికారం దుర్వినియోగం చేయకుండా బాధ్యత గా వహించాలి కదా అని ప్రశ్నించాడు?

కేవలం ఆడవారిపై జరిగే అత్యాచారాలపై మాత్రమే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తారా.మూగజీవులపై ఇలాంటి అత్యాచారాలు జరిగినప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయరని ప్రశ్నించాడు?అగర్వాల్ ట్విట్టర్ పై భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన జాతీయ మీడియా ప్యానలిస్టు దీనిపై స్పందిస్తూ పోలీసులు కేసు నమోదు చేయకుండా కామాంధులను రక్షిస్తున్నారని రీ ట్వీట్ చేశారు.చివరకు హరి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.