సిని ఇండస్ట్రీకి చెందిన వాళ్ళకు ఫ్రెండ్షిప్ పేరుతో రొమాన్స్ చేయడం అలవాటే.సమాజం ముందు ఫ్రెండ్స్ అన్నట్లుగా ఉంటారు.
కానీ లోపల మాత్రం తెగ రొమాన్స్ లు చేస్తారు.ఇక వాళ్ళ తీరును జనాలు వెంటనే పసిగడుతారు.
ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి.ఇప్పటికి చాలా మంది ఫ్రెండ్ షిప్ ముసుగులో బాగా రొమాన్స్ లు చేశారు.
చేస్తున్నారు.అందులో అషు రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్ లు ఉన్నారు.
సోషల్ మీడియా స్టార్ గా మారి ఇండస్ట్రీలో దూసుకుపోతున్న బ్యూటీ అషు రెడ్డి.ఈమె డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను బాగా ఫిదా చేసింది.
ఇక చూడటానికి సమంతలా కనిపించటంతో జూనియర్ సమంత అని పేరు కూడా వచ్చింది.అలా వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.

అలా రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది. ఇక టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.
పైగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు.పబ్లిక్ ప్లేస్ లలో చేసిన రచ్చ ఆ సమయంలో బాగా హాట్ టాపిక్ గా మారింది.
కానీ కొంతకాలానికే వీరిద్దరూ మళ్లీ దూరమయ్యారు.మళ్లీ అప్పటినుంచి తను రాహుల్ ని కలిసిందే లేదు.
కానీ లోలోపల వీరు కలుస్తున్నారు అనే అనుమానాలు రాక తప్పలేదు.అప్పటి నుంచి వీరిద్దరు బయట కనిపిస్తే చాలు జనాలు బాగా చెవులు కొరుక్కుంటారు.

ఇక అషు బిగ్ బాస్ తర్వాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.అంతేకాకుండా కామెడీ స్టార్ అనే షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.
ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇందులో కూడా మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.
ఇక బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది.ఇక ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.
కానీ వాటిని అస్సలు పట్టించుకోదు.అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ.
దుబాయ్ లో ఉండగా అక్కడ తన అందాలతో అక్కడి అందాలను కూడా బయట పెడుతుంది.అయితే తాజాగా ఒక వీడియో పంచుకోగా అందులో రాహుల్ సిప్లిగంజ్ ఉండగా.
రాహుల్ దుబాయ్ కి వచ్చి తనను సర్ప్రైజ్ చేసాడని అన్నది.అంతేకాకుండా వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నట్లు తెలుపగా కలిసి వీడియో చేస్తూ.
బాక్గ్రౌండ్ లో ఫ్రెండ్ షిప్ పాట కూడా పెట్టారు.దీంతో ఆ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
పైగా వాళ్ళు ఒకే రూమ్ లో ఉండటంతో నెటిజన్స్ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఫ్రెండ్ షిప్ పేరుతో భలే నటిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







