తారకరత్న మరణం తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.కొంతమంది సినీ ప్రముఖులు తారకరత్నకు భారీగా ఆస్తులు ఉన్నాయని ప్రచారం చేస్తుండగా మరి కొందరు మాత్రం తారకరత్నకు ఎలాంటి ఆస్తులు లేవని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
నందమూరి ఫ్యామిలీలో ట్రస్ట్ లు పెట్టి సేవా కార్యక్రమాలు చేశారని ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పటికీ నడిపిస్తున్నారని ఆయన తెలిపారు.
బాలయ్య బసవతారకం ఆస్పత్రి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.తారకరత్న అలేఖ్య పెళ్లి వల్ల తండ్రి తన ఆస్తులను కూతురు అయిన రూపకు రాశారని తెలుస్తోంది.
ఈ ఆస్తిలో తారకరత్న వాటాను తారకరత్న ట్రస్ట్ కు ఉపయోగించాలని ఆమె భావిస్తున్నారని బోగట్టా.

అయితే ఇలా చేస్తే మాత్రం అలేఖ్యారెడ్డికి ఆస్తిలో వాటా దక్కదు.ఇలా చేస్తే మాత్రం అలేఖ్య కుటుంబానికి అన్యాయం జరుగుతుంది.బాలయ్య జోక్యం చేసుకుని అలేఖ్యకు, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తారకరత్న ఆస్తులకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా సమస్య పరిష్కారం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తారకరత్న భార్య ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నారని తెలుస్తోంది.తారకరత్న చొరవ తీసుకోవడంతో ఈ పెళ్లి జరిగిందని దాము బాలాజీ కామెంట్లు చేశారు.40 సంవత్సరాల వయస్సులో భర్త చనిపోవడం ఎంతగానో బాధ పెట్టిందని ఆయన చెప్పుకొచ్చారు.దాము బాలాజీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం తారకరత్న కుటుంబానికి తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారని సమాచారం అందుతోంది.
రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.







