ఆ ముగ్గురితో కలిసి చాలా కొంటె పనులు చేశా.. నాగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఒకవైపు సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గా రాణిస్తున్నారు.తాజాగా ఒక సందర్భంలో నాగ్ మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Nagarjuna Shocking Comments Goes Viral In Social Media Details Here , Hyderabad-TeluguStop.com

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తో నాకు చాలా అనుబంధం ఉందని ఈ స్కూల్ లోకి వచ్చిన వెంటనే జ్ఞాపకాలు గుర్తొచ్చాయని తెలిపారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న నాగ్ ఈ కామెంట్లు చేశారు.

1976 సంవత్సరంలో నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నానని నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదని నాగ్ తెలిపారు.ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి నేను చేశానని నాగ్ చెప్పుకొచ్చారు.

నాతో పాటు చదివిన వాళ్లు వ్యాపారవేత్తలుగా లాయర్లుగా, జడ్జీలుగా స్థిరపడ్డారని ఆయన కామెంట్లు చేశారు.ఈ స్కూల్ లో నా పేరుతో ఒక బిల్డింగ్ ఉండటం వల్ల అందరూ నా పేరు విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారని నాగ్ వెల్లడించారు.

ఎవరికైనా నా పేరు చెబితే నేను నా పేరు చెబుతున్నానా లేక బిల్డింగ్ పేరు చెబుతున్నానా అని అడిగేవారని ఆయన కామెంట్లు చేశారు.కొన్నిసార్లు సైకిల్ పై మరి కొన్నిసార్లు నడుచుకుంటూ స్కూల్ కు వెళ్లేవాడినని నాగ్ పేర్కొన్నారు.ఇప్పుడు స్కూల్ లోకి వచ్చిన వెంటనే అప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని నాగ్ చెప్పుకొచ్చారు.1923 లో ఈ స్కూల్ ప్రారంభమైందని నాగ్ తెలిపారు.

నాగార్జునతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ స్కూల్ లోనే చదివారు.నాగార్జున హాజరు కావడంతో ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.వయస్సు పెరుగుతున్నా నాగార్జునలో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube