బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసినటువంటి ఈయన 2018 వ సంవత్సరంలో జీరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత షారుక్ ఎలాంటి సినిమాలు చేయకపోవడంతో ఈయన హవా తగ్గింది అంటూ అందరూ భావించారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా జనవరి 25వ తేదీ విడుదలైంది.
ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించింది.

ఈ విధంగా పఠాన్ సినిమాతో కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నటువంటి షారుక్ ఖాన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే అభిమానులతో చిట్ చాట్ చేసినటువంటి ఈయనకు ఒక నెటిజన్ నుంచి రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురయింది.రిటైర్మెంట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంటూ నెటిజన్ ప్రశ్నించగా అందుకు షారుఖ్ ఖాన్ సమాధానం చెబుతూ….
యాక్టింగ్ నుంచి నేను ఎప్పటికీ రిటైర్మెంట్ కాను నన్ను ఎవరు తొలగించలేరు.

ఒకవేళ నన్ను ఎవరైనా తొలగిస్తే అంతే కసిగా తిరిగి వస్తాను అంటూ నటనపై తనకు ఉన్నటువంటి ఇష్టం తెలియజేశారు.ఇలా రిటైర్మెంట్ గురించి షారుఖ్ ఖాన్ చెప్పినటువంటి సమాధానం కనక చూస్తుంటే ఈయన ఇకపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అర్థమవుతుంది.ప్రస్తుతం పఠాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన షారుఖ్ త్వరలోనే జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.







