విశాఖపట్నం కేజీహెచ్ లో మృతశిశువును బైకుపై తీసుకు వెళ్లిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణ పూర్తి అయింది.
సమన్వయ లోపంతోనే తప్పు జరిగిందని కమిటీ తేల్చింది.ఈ క్రమంలోనే ఎన్ఐసీయూ స్టాఫ్ నర్స్ కృష్ణవేణిపై సస్పెన్షన్ వేటు పడింది.
అదేవిధంగా మరో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.







