'పుష్ప 2' సర్ప్రైజ్ ట్రీట్ ఆ రోజే.. పార్ట్ 1 ను ఫాలో అవుతున్న సుక్కూ!

పుష్ప 2.ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.

 Is Allu Arjun Pushpa 2 Team Planning A Special Treat Soon Details, Allu Arjun, P-TeluguStop.com

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ కు పుష్ప పార్ట్ 1 భారీ లాభాలను తెచ్చి పెట్టింది.

పార్ట్ 1 170 కోట్లతో తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 380 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.దీంతో నిర్మాతలు బాగా లాభపడ్డారు.ఇక ఈ సినిమా సీక్వెల్ మీద ఉన్న అంచనాలను చూసి ఈసారి దాదాపు 400 కోట్లతో నిర్మిస్తున్నారని సమాచారం.మరి ఇటీవలే ఈ సినిమా పార్ట్ 2 షూట్ గ్రాండ్ గా వైజాగ్ లో స్టార్ట్ చేసి అక్కడ ఫస్ట్ షెడ్యూల్ ముగించారు.

Telugu Allu Arjun, Sukumar, Pushpa-Movie

ఇక రెండవ షెడ్యూల్ ఫిలిం సిటీలో స్టార్ట్ చేసి శరవేగంగా షూట్ చేస్తున్నారు.మరి షూట్ చేస్తున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే ట్రీట్ రాబోతుంది అని తెలుస్తుంది.పుష్ప 2 అప్డేట్ కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమా ట్రీట్ ఎప్పుడు రాబోతుంది అనే దానిపై ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

Telugu Allu Arjun, Sukumar, Pushpa-Movie

ఈ అప్డేట్ ని పార్ట్ 1 కి ఎలా అయితే ఇచ్చారో అదే ఫాలో అవుతున్నాడు సుకుమార్. పార్ట్ 1 ఫస్ట్ లుక్ లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ లో అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన విషయం విదితమే.ఇక ఇప్పుడు కూడా దీనినే ఫాలో అవుతూ అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా పార్ట్ 2 నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు అని తెలుస్తుంది.మరి ఈ స్పెషల్ ట్రీట్ కోసం కొద్దీ రోజులు ఎదురు చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube