ప్రముఖ నటుడు సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సోనూ సూద్ కి దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
కరోనా మహమ్మారి సమయంలో కొన్ని వేల మందికి సహాయం చేసి కలియుగ కర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సోను సూద్.రీల్ లైఫ్ లో విలన్ గా నటించినప్పటికీ రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో నటిస్తూ సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు.కరోనా మహమ్మారి నుంచి ఇప్పటివరకు, ఇప్పటికీ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు సోను సూద్.
కరోనా మహమ్మారి తరువాత సోనూ సూద్ ని ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోనూసూద్ హైదరాబాద్ లో సందడి చేశారు.కొండాపూర్ లో ఉన్న జిస్మత్ అరబిక్ రెస్టారెంట్లో ప్రపంచంలోనే అతిపెద్ద సోనూ సూద్ మండి ప్లేట్ ని ప్రారంభించారు.ఆ మండిలో ఉన్న ప్లేట్ ప్రారంభ వేడుకకు నటి హిమజ ఇంస్టాగ్రామ్ పద్దు పద్మావతి తో పాటుగా పలువురు సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు.
ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ హైదరాబాద్ ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరం.మరి ముఖ్యంగా ఇక్కడ అనేక రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి.
ఇండియాలోనే అతిపెద్ద మండి ప్లేట్ ని ప్రారంభించడం అభినందనీయం అని తెలిపారు సోనుసూద్.అంతేకాకుండా ఈ మండి ప్లేట్ అనేది ఎవరు ఊహించని రీతిలో ఉంది అని తెలిపారు.అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ.ఈ మండి ప్లేట్ ఎనిమిది అడుగులో ఉంటుందని ఈ ప్లేట్ లో ఏకంగా 20 మందికి పైగా తినొచ్చు అని రెస్టారెంట్ నిర్వాహకులు వెల్లడించారు.
ఈ అతి పెద్ద మండి మా అన్ని బ్రాంచుల్లో ఉంటుంది అని వారు వెల్లడించారు.కాగా సోనూ సూద్ కొండాపూర్ లోని జిస్మత్ అరబిక్ రెస్టారెంట్ వస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
అంతేకాకుండా సోనూ సూద్ తో కలిసి సెల్ఫీలు దిగడానికి పెద్ద ఎత్తున పోటీపడ్డారు.కాగా ప్రస్తుతం అతిపెద్ద మండి ప్లేట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ప్లేట్ ని చూసిన నెటిజెన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.